Last Updated:
Trisha Krishnan: తమిళనాడులో అనేక సమస్యలున్నాయి. నిరుద్యోగు, కావేరీ నీటి కొరత, అభివృద్ధి మందగించడం, అప్పులు, రైతుల కష్టాలు.. ఇలా ఎన్నో. అయినా అవన్నీ పక్కకుపోయి నటి త్రిష.. వార్తల్లో నిలుస్తుండటం విచారకరం. రాజకీయ నేతలు ఏ స్థాయికి దిగజారిపోయారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది. నటి త్రిషను ఉద్దేశించి అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు.. త్రిష అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఇంతకీ ఆర్బీ ఉదయకుమార్ ఏమన్నారు? త్రిషకు డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు? ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశం ఏంటి? నిజంగానే త్రిషను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా చేసే పరిస్థితులు ఉన్నాయా? లేక కేవలం రాజకీయ విమర్శల్లో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తమిళనాడులో చర్చకు దారితీస్తున్నాయి.














