Last Updated:
Donald Trump: అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ నిరంతరం వార్తల్లో నిలిచే స్వభావం కారణంగా.. ఏదో ఒక సంచలనాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కొత్తగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్, బర్త్ టూరిజం అనే.. రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు. దీని ప్రభావం భారతీయులు, NRIలపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్, బర్త్ టూరిజం అనే రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఈమధ్య తీర్పు తర్వాత జరిగిన సర్దుబాటు అని వైట్ హౌస్ తెలిపింది. ANI న్యూస్ రిపోర్టు ప్రకారం, ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ “మేము చాలా పెద్ద ఎత్తున క్రాక్‌డౌన్ చేస్తున్నాము” అని చెప్పారు. “బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విషయంలో సుప్రీంకోర్టు చాలా దురదృష్టకరమైన నిర్ణయం తీసుకుంది.. కాబట్టి మేము సర్దుబాట్లు చేస్తున్నాము” అని ఆయన అన్నారు.














