అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై ఏ క్షణమైనా భీకర సైనిక దాడికి అమెరికా దిగవచ్చని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మే 19) వైట్‌హౌస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడికి ఆదేశాలు ఇచ్చేందుకు తాను కేవలం ఒక గంట దూరంలో ఉన్నానని, అయితే యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్ (ఇరాన్) నుండి కొత్త ప్రతిపాదన రావడంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పాలకులు ఒక ఒప్పందం కోసం తమ ముందు దేబిరిస్తున్నారని, ఒకవేళ డీల్ కుదరకపోతే రాబోయే రోజుల్లో ఆ దేశంపై భారీ దాడులు తప్పవని హెచ్చరించారు. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తనతో జరిగిన భేటీలో.. తాము ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు, సైనిక సామగ్రి సరఫరా చేయబోమని హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని తిరిగి తెరిపించేందుకు, ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు ట్రంప్ ఈ మేరకు అంతర్జాతీయ ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
Source link
Trump Warns Iran: ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్లాన్..డీల్ కుదుర్చుకోకపోతే బాంబుల వర్షమే | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










