Under-Construction Warehouse Roof Collapses : కోల్కతాలో ఘోర ప్రమాదం..! | ACTPnews

Under-Construction Warehouse Roof Collapses : కోల్కతాలో ఘోర ప్రమాదం..!



పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తారతలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ (గిడ్డంగి) పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగి గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *