ఉపాసన తాత, ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని అపోలో గ్రూప్ (Apollo Group of Hospitals) మార్కెట్ విలువ దాదాపు ₹70,000 కోట్లకు పైగా ఉంటుంది. ఉపాసన నికర సంపద దాదాపు 1130 కోట్లు. అపోలో సంస్థలో కీలక పదవులతో పాటు, అపోలో లైఫ్ వెల్నెస్ చైన్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ (FHPL) లలో ఈమెకు భారీగా వాటాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఉపాసన కామినేని రామ్ చరణ్ నికర విలువ దాదాపు 2500 కోట్ల రూపాయలు. ఇందులో జూబ్లీహిల్స్‌లోని 50 కోట్ల విలువైన 25,000 చదరపు అడుగుల విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి. దీంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల వారికి పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లు సమాచారం.













