Last Updated:
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన పెద్ది మూవీ నేడు (జూన్ 4న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్ర ప్రీమియర్స్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన మస్తుగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
పెద్ద హీరో సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద ఆ హంగామా ఎలా ఉంటుందనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమా థియేటర్స్ లో కూడా అదే జోష్ కనిపించింది. ఈ రోజు జూన్ 4 పెద్ది రిలీజ్ అవుతుండగా.. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకొని హంగామా చేశారు. అయితే ఈ సారి ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా చేరిపోవడం విశేషం. చెర్రీ పెద్ది మూవీ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఉపాసన.
హైదరాబాద్ బాలానగర్‌లో పెద్ది స్పెషల్ స్క్రీనింగ్‌కు వచ్చిన ఉపాసన (Upasana), రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సినిమా చూసి వారిలో తెగ ఎంజాయ్ చేశారు. సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సమయంలో పేపర్లు ఎగరేసి అక్కడున్న అందరిలో జోష్ పెంచారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లోకం ఎంతగానో ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జోరుగా ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఇక రామ్ చరణ్ సెన్సేషన్ ఖాయమని, నిర్మాతలకు కాసుల పంటే అనే టాక్ నడుస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













