Last Updated:
సినిమా సెలబ్రిటీలు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కొన్ని సందర్భాల్లో హీరోహీరోయిన్ల కుటుంబ సంగతులు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు హీరో ఉపేంద్ర ఫ్యామిలీ విషయాలు, ఆయన భార్య ఎవరు అనే సంగతులు ఇప్పుడు చూద్దాం.
వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే విలక్షణ నటుడు ఉపేంద్ర. ఆయన కెరీర్లో ‘ఓమ్’, ‘ఏ’, ‘రా’, ‘ఉపేంద్ర’, ‘హెచ్2ఓ’, ‘యూఐ’ వంటి చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోయే ‘ఎవర్గ్రీన్’ బ్లాక్బస్టర్లు. ఉపేంద్ర కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా. సమాజంలోని యదార్థ పరిస్థితులను తనదైన శైలిలో వ్యంగ్యంగా, వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన దిట్ట.
పేరుకు కన్నడ హీరోనే అయినా.. తెలుగు ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఉపేంద్ర. తనదైన నైజంతో వెండితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. అసలు.. ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే ఇక్కడ పెద్ద సెన్సేషనే.
ఇకపోతే దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించారు ఉపేంద్ర. ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. ఆయన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ కల్పితంలా కాకుండా నిజ జీవిత పాత్రలా అనిపిస్తుంటుంది. అందుకే, 56 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి.
హీరోగానే కాకుండా, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ వంటి చిత్రాలలో సహాయ నటుడిగానూ నటించారు ఉపేంద్ర. ఇటీవల ‘కూలీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో మెప్పించారు. తన సినీ కెరీర్లో సుమారు 60కి పైగా సినిమాల్లో నటించిన ఉపేంద్ర వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన భార్య కూడా తెలుగులో ఓ క్రేజీ హీరోయిన్. పైగా ఆయనతో కలిసి సినిమాల్లో కూడా నటించింది.
ఉపేంద్ర భార్య పేరు ప్రియాంక. ఆమె ఓ బెంగాలీ నటి. ఒకప్పుడు బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. ఓ సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2003లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు ఉపేంద్ర భార్య ప్రియాంక. ఆమె అసలు పేరు ప్రియాంక త్రివేది. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన ‘రా’, ‘హెచ్2ఓ’ సినిమాల్లో కూడా ప్రియాంకనే హీరోయిన్. సుమారు 50కి పైగా సినిమాల్లో ఆమె నటించింది.
కాగా రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోల గురించి ఆమె చేసిన వాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్ హీరోలలో అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపింది ప్రియాంక. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి వారు కూడా ఆల్ టైం తన ఫేవరేట్ హీరోస్ అని ఆమె తెలిపింది.
సినిమాలతో పాటు ప్రియాంక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటోంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. దీంతో ప్రస్తుతం ఉపేంద్ర ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 23, 2026 12:56 PM IST













