Last Updated:
US-Iran War: పశ్చిమాసియా జలాల్లో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పారకాష్టకు చేరాయి. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక (Aircraft Carrier), నేవీ డిస్ట్రాయర్లపై తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ దాడితో ఇరు దేశాల మధ్య సముద్ర జలాల్లో ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. తమ నౌకలను వేధింపులకు గురిచేస్తూ, నౌకాదళ దిగ్బంధంలో పాల్గొంటున్నందునే అమెరికా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్జీసీ తెలిపినట్లు అల్ జజీరా పేర్కొంది. తమ క్షిపణి దాడిలో అమెరికా నౌకలు దెబ్బతిన్నాయని, మరిన్ని దాడులు జరుగుతాయన్న భయంతో ఆ రెండు యుద్ధనౌకలు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోయాయని తస్నిమ్ వార్తా సంస్థ ద్వారా ఇరాన్ బలగాలు వెల్లడించాయి.














