Congress Party Maha Dharna: ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

కాంగ్రెస్ పార్టీ (ఫైల్ ఫోటో)


Last Updated:

Congress Party Maha Dharna: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది.

కాంగ్రెస్ పార్టీ (ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ పార్టీ (ఫైల్ ఫోటో)

ఈ క్రమంలో సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  కేసీఆర్ ప్రజాప్రతినిధిగా ఉంటూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై వీహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఒక సాధారణ ఉద్యోగి వారం రోజుల పాటు విధులకు హాజరుకాకపోతే జీతం కట్ చేస్తారు. మరి ప్రజాప్రతినిధిగా ఉండి సభకు రాని కేసీఆర్‌కు జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి?” అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తక్షణమే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, లేనిపక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *