Last Updated:
US visa revocation: బర్త్ టూరిజంగా వస్తున్నవారు.. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో డెలివరీ చేయించుకోకూడదు అని ట్రంప్ ప్రభుత్వం బలంగా డిసైడ్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి.. పుట్టే బిడ్డులకు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాకుండా ఉండాలంటే.. వీసా ఇవ్వకపోవడమే సరైన మార్గం అని ట్రంప్ భావిస్తున్నారా?
అమెరికా వీసా నిబంధనలు మరింత కఠినంగా మారుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా “బర్త్ టూరిజం” (Birth Tourism) అరికట్టే దిశగా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత నెల రోజుల్లో సుమారు 600 మంది విదేశీ గర్భిణుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ (State Department) అధికారికంగా ప్రకటించింది. ఈ ఆకస్మిక, కఠినమైన నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














