Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే కెప్టెన్సీ.. అదరగొట్టిన బాస్ బేబీ.. ఆ టోర్నీలో ఆసక్తికర పరిణామం! | క్రీడా వార్తలు | ACTPnews

వైభవ్ సూర్యవంశీ


Last Updated:

Vaibhav Sooryavanshi: సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ

ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానాన్ని వీడటంతో, 15 ఏళ్ల సంచలన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. నాయకత్వ పగ్గాలు అందుకున్న సమయంలో ఈ యువ ఆటగాడి ముఖంలో చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్ మైదానంలో అత్యంత అరుదైన దృశ్యంగా, సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్సీని చేపట్టాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు బంతి బలంగా తగలడంతో గాయపడ్డాడు. ఫిజియోల నుంచి ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం, అతను తదుపరి వైద్య చికిత్స కోసం మైదానం వెలుపలికి వెళ్లాడు. ఆ తర్వాత ఇషాన్ చేయికి బ్యాండేజ్ కట్టి ఉండగా కనిపించగా, అతని స్థానంలో జార్ఖండ్ సహచర ఆటగాడు కుమార్ కుషాగ్రా వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed