ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.












