Varun Tej: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి వచ్చేది ఆ రోజే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వినూత్న కథ, డిఫరెంట్ లుక్, హారర్-కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

News18
News18

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాల ఎంపికలో ఎప్పుడూ భిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఈసారి కూడా ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించేందుకు ‘కొరియన్ కనకరాజు’ అనే ఇండో-కొరియన్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, ప్రచార కంటెంట్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. హారర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాల కలయికలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే “కొరియన్ కనకరాజు” అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఈ కనకరాజు ఎవరు? కొరియాతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మేకర్స్ మాత్రం కథను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ, సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన ప్రచార వీడియోలను బట్టి చూస్తే.. వరుణ్ తేజ్ పోషిస్తున్న కనకరాజు పాత్రకు కొరియా దేశంతో అనుబంధం ఉంటుందని, ఆ ప్రయాణంలో జరిగే వింత సంఘటనలే కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి వినోదాత్మక కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో ఆయన స్టైల్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈసారి కూడా భయంతో పాటు నవ్వులు పంచే కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

వరుణ్ తేజ్‌కు జోడీగా రీతికా నాయక్ నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరి కామెడీ టైమింగ్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి దక్షిణ కొరియాలో జరిగిన షూటింగ్. కథలో కీలక భాగాన్ని అక్కడ చిత్రీకరించినట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అందమైన లొకేషన్లు, వినూత్న విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ సినిమాకు కొత్త ఫీల్ తీసుకురానున్నాయని సమాచారం.

గత కొన్ని సినిమాల తర్వాత వరుణ్ తేజ్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పూర్తిగా కొత్త జానర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆయనకు ఈ సినిమా విజయవంతం కావడం కీలకంగా మారింది. అందుకే ప్రచార కార్యక్రమాలను కూడా చిత్రబృందం వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ‘కంసాహమ్నిదా’ పాటకు మంచి స్పందన లభించగా, టీజర్, పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా విడుదలైన రిలీజ్ పోస్టర్‌లో వరుణ్ తేజ్ లుక్, విజువల్ డిజైన్, హారర్ కామెడీ టోన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. హాస్యం, హారర్, థ్రిల్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed