Vennela Kishore: బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’.. ఓటీటీ ఎంట్రీకి సిద్ధం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్’ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 3 రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది.

News18
News18

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్’ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 3 రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, చురుకైన డైలాగులు, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్ రానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా రూపొందుతోన్న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3కి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మ‌రింత అస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్‌తో సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3.. తాజాగా రిలీజ్ చేసిన ‘సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3’ పోస్టర్ చూస్తుంటే కథలో ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే విష‌యం తెలుస్తోంది. రెండు వైవిధ్య‌మైన ప్ర‌పంచాల మ‌ధ్య జ‌రిగే ప్ర‌త్యేక‌మైన సోష‌ల్ ఎక్స్‌పెరిమెంట్ క‌థ‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చ‌నుంది. ఈ అంశం మొత్తం క‌థ‌ను స‌రికొత్త పంథాలో ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది. మూడు జంట‌లు.. అందులోని భ‌ర్త‌లు ప‌డే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జ‌యిటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది క‌థ‌ను స‌రికొత్త విధానం చూపించ‌టంతో పాటు సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానానికి కూడా అవకాశం దక్కనుంది. దీంతో ప్రేక్షకులు మ‌రోసారి నవ్వులు, రిలేషన్‌షిప్ సమస్యలు, సరదా, కామెడీ డ్రామా ఇలా అన్నీ అంశాలు క‌లిసున్న ఆల్ ఇన్ వ‌న్ ప్యాకేజ్‌గా సీజ‌న్‌3ని ఎంజాయ్ చేయొచ్చు.

సీజ‌న్‌ ౩లో వెన్నెల కిషోర్‌ స‌ర్‌ప్రైజ్‌.. మొదటి రెండు సీజన్లలో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న‌ ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్ 3లోనూ అల‌రించ‌నున్నారు. ఇక ఈ సీజ‌న్‌3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నారు. పోస్ట‌ర్ చూస్తుంటే ఆయ‌న పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర క‌థ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకురావ‌ట‌మే కాకుండా, అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామ‌టిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చ‌బోతున్నార‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌- దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed