Last Updated:
‘భగవంత్ కేసరి’ సినిమాకు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమాకు ఇప్పుడు మళ్లీ ప్రాణం వచ్చింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ దెబ్బకు ఉలుకూ పలుకూ లేకుండా పోయింది.
‘భగవంత్ కేసరి’ సినిమాకు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమాకు ఇప్పుడు మళ్లీ ప్రాణం వచ్చింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ దెబ్బకు ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక తమిళనాట పెద్ద సంచలనమే సృష్టించింది. ట్రైలర్లో చాలా డైలాగ్స్ రాజకీయం పరంగా వివాదాస్పదం అయ్యాయి. దాంతో సెన్సార్ వరకు వెళ్లిన ఈ సినిమాను అక్కడే సంకెళ్లు వేసి బంధించేశారు.
మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సినిమా మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. ఆ తర్వాత ఫ్రిబవరిలో రిలీజవుతుందంటూ మేకర్స్ విజయ్ అభిమానులను కాస్త చల్లబరిచారు కానీ… కానీ మళ్లీ సెన్సార్ నుంచి, రాజకీయ నాయకుల అభ్యంతరాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా అక్కడే కదల్లేని స్థితిలో ఉండిపోయింది. ఇక కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ప్రాణం వచ్చినంత పనైంది. ఎవరూ ఊహించిన రేంజ్లో విజయ్ తమిళనాడు కొత్త సీఎంగా జెండా పాతేసీ.. ఇప్పుడు తన ఈ సినిమాకు రూటు క్లియర్ చేశాడు.
తాజా ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం.. విజయ్ అభిమానుల పండగ చేసుకునే ఒక అద్భుతమైన సీజన్‌ను ఈ సినిమా విడుదల కోసం చిత్రబృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకలకు సరిగ్గా మూడు రోజుల ముందే, అంటే జూన్ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే ‘డిస్ట్రిక్ట్’ (District) వంటి ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్ జూన్ 19గా చూపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దాదాపు ఈ డేట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ పూర్తి క్లారిటీ రాదు. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్స్ ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. ముందుగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ సంస్థ కొనుక్కుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు నోచుకోకపోవడం.. రకరకాలు ఇబ్బందులు వెంటాడటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పుకుంది. ఇక ఇప్పుడు విజయ్ సీఎం అవడంతో ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్స్ వస్తున్నాయట.
అయితే… మేకర్స్ మాత్రం జీ5 వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేసిన దానికంటే జీ5 చాలా ఎక్కువ రేటుకు డీల్‌ను కుదరించుకునే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సినిమా అఫిషియల్ రీమేక్‌గా జననాయగన్ తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన రోల్ మమిత బైజు చేస్తుంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













