Vijay Antony: విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ కొత్త పోస్టర్ విడుదల.. ఫాదర్- డాటర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ స్టోరీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఫాదర్- డాటర్ సెంటిమెంట్‌తో విజయ్ ఆంటోని హీరోగా రూపొందుతున్న ఎమోషనల్ స్టోరీ నాన్న కుట్టి. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

News18
News18

కంటెంట్‌కి ప్రాధాన్యతను నిస్తూ కథల్ని ఎంచుకుంటూ ఉంటారు విజయ్ ఆంటోని. ఆయన సినిమాలు అంటే తెలుగు ఆడియెన్స్‌లో సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. వరుస ప్రాజెక్టులతో విజయ్ ఆంటోని ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘వంద దేవుళ్ళు’ అనే సందేశాత్మక చిత్రంతో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం ఆయన మరో డిఫరెంట్ కథను ఎంచుకున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విజయ్ ఆంటోని బర్త్ డే సందర్భంగా మరో కూల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తండ్రీ కూతుళ్లు నవ్వుతూ కనిపిస్తున్నారు.. స్కూల్‌కి వెళ్లే కూతురు.. ఆ కూతురి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్‌ని పట్టుకుని విజయ్ సింపుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా, సహజత్వానికి దగ్గరగా ఉండే కథగా ‘నాన్న కుట్టి’ వస్తోందని ఈ పోస్టర్లను గమనిస్తే అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన, భావోద్వేగభరితమైన, మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports