Last Updated:
అనతి కాలంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్న విజయ్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్స్ తో పాటు తీవ్రంగా నిరాశపరిచిన డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు అత్యంత భారీ అంచనాలతో మొదలై, ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన ఒక సినిమా కూడా ఉంది.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినీ ప్రయాణం ఎన్నో సంచలనాలు, ఊహించని మలుపులను కెరాఫ్ అడ్రస్. అనతి కాలంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్న విజయ్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్స్ తో పాటు తీవ్రంగా నిరాశపరిచిన డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ, విజయ్ కెరీర్‌లో అత్యంత భారీ అంచనాలతో మొదలై, ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన ఒక సినిమా ఉందన్న విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ సినిమా పేరు ‘హీరో’ (Hero).
2019లో ‘డియర్ కామ్రేడ్’ విడుదలైన సమయంలోనే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఈ ‘హీరో’ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా నటించాల్సి ఉంది. ఆయన సరసన మాళవికా మోహనన్, షాలిని పాండే హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌కే సుమారు రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ఆ షూటింగ్ ఔట్‌పుట్ చూశాక విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని దర్శకుడికి సూచించారు. కానీ, దర్శకుడు చేసిన మార్పులు హీరోకు, నిర్మాతలకు ఏమాత్రం రుచించకపోవడంతో, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఆ తర్వాత విజయ్ వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ‘హీరో’ ప్రాజెక్ట్ శాశ్వతంగా అటకెక్కింది.
గతేడాది వచ్చిన ‘కింగ్‌డమ్’ ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో 19వ శతాబ్దపు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రణబాలి మూవీ తెరకెక్కుతోంది. రష్మిక మందానా హీరోయిన్‌గా నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న విడుదల చేయాలని ముందుగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రౌడీ జనార్దన్ (Rowdy Janardhan): రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టితో పాటు ‘హాయ్ నాన్న’ ఫేమ్ దర్శకుడు శౌర్యువ్‌తో కలిసి ఒక బిగ్ స్కేల్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో కూడా విజయ్ నటిస్తున్నారు.
ఒకవేళ ‘హీరో’ సినిమా పూర్తయి ఉంటే, మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌కు (Malavika Mohanan) అదే తొలి తెలుగు సినిమా అయ్యేది. ఆ సినిమా ఆగిపోయినప్పటికీ, దళపతి విజయ్ ‘మాస్టర్’, రజనీకాంత్ ‘పెట్టా’, విక్రమ్ ‘తంగలాన్’ వంటి డబ్బింగ్ సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన భారీ హారర్-కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ద్వారా ఆమె నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇప్పుడు ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన ఒక క్రేజీ మల్టీస్టారర్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. అటు తమిళంలోనూ కార్తి ‘సర్దార్ 2’ లో నటిస్తూ దక్షణాదిన తన హవా కొనసాగిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














