Vipraj Nigam: టీమిండియా స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌పై అత్యాచారం కేసు.. ఇంటి ముందు బాధితురాలి ఆందోళన! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జపాన్‌తో జరగనున్న చారిత్రక టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్న టీమిండియా యువ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

News18
News18

జపాన్‌తో మంగళవారం జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన భారత యువ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ అనుకోని వివాదాలు ముసురుకున్నాయి. గాయపడిన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో జాతీయ జట్టులోకి తొలిసారి పిలుపు అందుకున్న ఈ 22 ఏళ్ల యూపీ క్రికెటర్‌పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనను నోయిడాలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని నిగమ్ ఇంటి ముందు గంటల తరబడి ఆందోళన చేపట్టింది.

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆ క్రికెటర్‌తో తాను నేరుగా మాట్లాడాలని, అనవసరంగా ఎలాంటి గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదని ఆమె మీడియాకు స్పష్టం చేసింది. అప్రమత్తమైన నిగమ్ తండ్రి ఆమెతో ఫోన్‌లో మాట్లాడి, వారం తర్వాత ఈ వ్యవహారంపై చర్చిద్దామని నచ్చజెప్పినట్లు సమాచారం. కాగా విప్రాజ్ 2026 ఆసియా క్రీడల భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

ఈ వివాదంలో విప్రాజ్ నిగమ్, సదరు మహిళ ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. యువతి తనను వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరిస్తోందని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపిస్తూ 2025 నవంబర్ 8న బారాబంకి పోలీస్ స్టేషన్‌లో నిగమ్ ముందుగా ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్‌గా ఆమె గౌతమ్ బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో నిగమ్‌పై కేసు నమోదు చేసింది.

గత ఏడాది మే నెలలో సోషల్ మీడియా వేదికగా వీరికి పరిచయం ఏర్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ చనువుతోనే జూలై 29న తనను నోయిడా తీసుకెళ్లి శారీరకంగా దాడికి పాల్పడ్డాడని డిసెంబర్‌లో కేసు పెట్టింది. ఇక క్రికెట్ కెరీర్ పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్‌కు ఆడుతున్న నిగమ్.. దేశవాళీలో మంచి రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున 19 మ్యాచ్‌లు ఆడి 36 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed