Last Updated:
Viral Video: సినిమాల్లో హీరోలను ఇమిటేట్ చేయడం ప్రస్తుతం ఫ్యాషన్ కాదు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఆ మధ్య అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసినట్లే..ఇప్పుడు పెద్ది మూవీలోని చికిరి చికిరి పాటకు ఓ పెళ్లి కొడుకు డ్యాన్స్ అదరగొట్టాడు. వీడియో ఇదిగో.
Viral Video: సినిమాల ప్రభావం జనంపై ఏదో విధంగా కనిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందరికి వేదికగా మారడంతో ప్రతీ ఒక్కరూ తమకు నచ్చినట్లుగా ప్రవరిస్తూ ఆ వీడియోలను అందరికి షేర్ చేస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు, సినీ స్టార్స్ చేసే డ్యాన్సులు, పాటలకు స్టెప్పులు వేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఓ వెడ్డింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఏదైనా పెళ్లి వేడుక, లేదంటే రిసెప్షన్ జరుగుతుంటే అక్కడ వధువరుల ఫ్రెండ్స్ డ్యాన్సులు చేయడం చూస్తుంటాం. కాని వైరల్ అవుతున్న వీడియోలో స్వయంగా పెళ్లి కొడుకే తన భార్య ముందు పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్‌కి క్రికెట్ బ్యాట్ పట్టుకొని అదిరిపోయే స్టెప్పులు వేశాడు.
సినిమాల్లో హీరోలను ఇమిటేట్ చేయడం ప్రస్తుతం ఫ్యాషన్ కాదు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఆ మధ్య అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్‌ని మహామహులు అనుకరిస్తూ వీడియోలు, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత హీరో నాని యాక్ట్ చేస్తున్న ది పారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్‌కి సేమ్ టూ సేమ్ స్టెప్పులు వేస్తూ వీడియోలను అందరితో షేర్ చేసుకున్నారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన న్యూ మూవీ పెద్దిలోని చికిరి చికిరి సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న చికిరి చికిరి సాంగ్ ఇప్పుడు నయా ట్రెండ్ సెట్ చేసింది. సినిమా రిలీజైన తర్వాత కూడా ఆ పాటకు ప్రేక్షకులే కాదు అందరూ ఫిదా అవుతున్నారు. గ్యాప్ దొరికితే చాలు రామ్ చరణ్ వేసిన స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఓ వెడ్డింగ్ సెలబ్రేషన్లో కూడా కొత్త పెళ్లికొడుకు మెడలో పూల దండలు తీయకుండానే స్టేజీపై తన లైఫ్ పార్టనర్‌ని ఖుషీ చేయడానికి చికిరి చికిరి పాటకు డ్యాన్స్ చేశాడు. ఓ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని అతను డ్యాన్స్ చేస్తుంటే నూతన వధువు ముసిముసి నవ్వులు కురిపించింది.
ఇక పెళ్లికి వచ్చిన బంధువులు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఈ డ్యాన్స్ మూమెంట్స్‌ని చూసి సంతోష పడటమే కాకుండా తమ సెల్ఫోన్లో షూట్ చేసుకున్నారు. ఈ పెళ్లి కొడుకు డ్యాన్స్ ఫర్ఫామెన్స్ వీడియోకి జనం లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు కామెంట్స్‌తోనే ఫ్యాన్స్ వార్ కూడా జరుగుతోంది.
Hyderabad,Telangana













