భారత రన్‌మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు, జట్టులో తన స్థానం, ఆట పట్ల తనకున్న అంకితభావంపై అత్యంత స్పష్టమైన, సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కేవలం క్రికెట్ మరియు బ్యాటింగ్‌ను అమితంగా ప్రేమిస్తాను కాబట్టే మైదానంలో కొనసాగుతున్నానని, అంతేకానీ ఎవరికీ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని కోహ్లీ తేల్చిచెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అధికారిక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న విరాట్.. తన కెరీర్, ఫిట్నెస్ రహస్యాలు మరియు రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అంశాలపై మనసు విప్పి మాట్లాడాడు.













