Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా అరుదైన రికార్డు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.

News18
News18

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన చరిత్ర సృష్టించాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 27) వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 15,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు 15 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు కోహ్లీకి 59 పరుగులు అవసరం కాగా, కేవలం 47 బంతుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాడు.

296 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన కోహ్లీ.. వ్యక్తిగత స్కోరును 57 నుంచి 61 పరుగులకు పెంచుకుని తన మొత్తం వన్డే పరుగులను 15,002కు చేర్చాడు. సచిన్ 377 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకోగా, కోహ్లీ తన 315వ వన్డేలోనే (303వ ఇన్నింగ్స్) పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా బీసీసీఐ కోహ్లీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (1989-2012 మధ్య 463 మ్యాచ్‌లలో 18,426 పరుగులు, 49 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (315 మ్యాచ్‌లలో 15,002* పరుగులు, 54 శతకాలు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (404 మ్యాచ్‌లలో 14,234 పరుగులు), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) వరుసగా టాప్-5లో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆసియాతర జట్లపై అత్యధికంగా 96 సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన భారత ఆటగాడిగానూ సచిన్ (95) రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు.

Most runs in ODIs

PLAYER COUNTRY TIME SPAN MATCHES RUNS BEST SCORE AVERAGE STRIKE RATE 100 50
Sachin Tendulkar India 1989-2012 463 18426 200* 44.83 86.23 49 96
Virat Kohli India 2008-2026 315* 15002* 183 58.59 93.95* 54* 80*
Kumar Sangakkara Sri Lanka 2000-2015 404 14234 169 41.98 78.86 25 93
Ricky Ponting Australia 1995-2012 375 13704 164 42.03 80.39 30 82
Sanath Jayasuriya Sri Lanka 1989-2011 445 13430 189 32.36 91.2 28 68

వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న కోహ్లీ.. సొంతగడ్డపై మరో రెండు రికార్డుల వేటలో ఉన్నాడు. స్వదేశంలో జరిగిన వన్డేల్లో సచిన్ 164 మ్యాచ్‌లలో 6,976 పరుగులు చేయగా, కోహ్లీ 131 మ్యాచ్‌లలో 6,919 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు (పాంటింగ్ 5,406, రోహిత్ శర్మ 5,217, కలిస్ 5,178 తర్వాతి స్థానాల్లో ఉన్నారు). ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ కనీసం 110 పరుగులు చేస్తే స్వదేశంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన సచిన్ రికార్డును అధిగమిస్తాడు. ఒకవేళ 133 పరుగులు చేస్తే సొంతగడ్డపై 7,000 వన్డే పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

Most runs in home ODIs

PLAYER COUNTRY TIME SPAN MATCHES RUNS BEST SCORE AVERAGE STRIKE RATE 100 50
Sachin Tendulkar India 1990-2011 164 6976 200* 48.11 88.39 20 38
Virat Kohli India 2009-2026 131* 6919* 166* 62.42 97.66 27 37*
Ricky Ponting Australia 1995-2012 153 5406 134* 39.17 79.35 13 32
Rohit Sharma India 2007-2026 103 5217 264 55.5 103.73 14 25
Jacques Kallis South Africa 1996-2013 142 5178 139 46.64 75 6 40



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports