WAPL 2026 Auction: 4 ఫ్రాంచైజీలు.. 191 మంది ప్లేయర్స్.. నేడే డబ్ల్యూఏపీఎల్‌ వేలం! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

WAPL 2026 Auction: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను ప్రోత్సహించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మహిళల ప్రీమియర్ లీగ్ (WAPL) కీలక దశకు చేరుకుంది.

PC: X.com
PC: X.com

విజయవాడ వేదికగా నేడు (మంగళవారం) ప్లేయర్స్ వేలం ప్రక్రియ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేలంలో పాల్గొని మహిళా క్రీడాకారిణులను దక్కించుకునేందుకు నాలుగు ఫ్రాంచైజీలు సర్వసన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మొత్తం 191 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 80 మందికి లీగ్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఈ వేలం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఈ వేలాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. @aplyoutube చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed