రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఎందుకు దొరకడం లేదు.. టీటీడీ చెప్పిన ఆన్షర్ తెలిస్తే షాక్ అవుతారు..! TTD online booking. | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లపై టీటీడీ వివరణ ఇచ్చింది. భారీ డిమాండ్ కారణంగా టికెట్లు దొరకడం లేదని, సాంకేతిక వైఫల్యం కాదని స్పష్టం చేసింది. 2.69 లక్షల టికెట్లకు 24 లక్షల డిమాండ్ ఉందని తెలిపింది

News18
News18

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వస్తున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. టికెట్లు దొరకకపోవడానికి ప్రధాన కారణం భారీ డిమాండ్‌ అని తెలిపింది. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పటిష్టంగానే పనిచేస్తోందని, టికెట్ లభించకపోవడాన్ని సాంకేతిక వైఫల్యంగా భావించవద్దని స్పష్టం చేసింది.

రూ.300 టికెట్ల కోసం ఒకేసారి సుమారు 6 లక్షల మంది యూజర్లు ప్రయత్నిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. దాదాపు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షలు మాత్రమే కావడంతో డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది.

ఇంత భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు టీటీడీ ఆన్‌లైన్ వ్యవస్థను Google Cloud Platform, Load Balancing, Auto Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక Technical War-Room ఏర్పాటు చేసి అప్లికేషన్ పనితీరు, సర్వర్ల పరిస్థితి, లావాదేవీలు, భద్రత తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. అధిక ట్రాఫిక్ సమయంలో వ్యవస్థపై ఒక్కసారిగా భారం పడకుండా Virtual Queue విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతాయని టీటీడీ వివరించింది. ఈ సమయంలో ‘Slot Unavailable’ వంటి సందేశాలు కనిపించవచ్చని, దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉందని నిర్ధారించడం సరికాదని స్పష్టం చేసింది. Virtual Queue భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు కాదని.. అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే సాంకేతిక విధానమని తెలిపింది.

ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలోనూ టీటీడీ వివరణ ఇచ్చింది. చెల్లింపు ప్రక్రియ టీటీడీ అప్లికేషన్‌తో పాటు Payment Gateways, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, UPI వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఏదైనా Transaction విఫలమైతే సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా చూడొద్దని భక్తులకు సూచించింది.

భక్తుల Feedback ఆధారంగా Online Booking, Application, Database Performance, High-Load Handling, Security, Anti-Bot Mechanisms, Payment Processesలో నిరంతరం మార్పులు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. గత ట్రాఫిక్‌ను, రాబోయే బుకింగ్‌లలో ఉండే డిమాండ్‌ను అంచనా వేసి Capacity Planning, Infrastructure Scalingను కూడా సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. పద్మావతి అమ్మవారి ఆలయం, కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే విధానంలో విడుదల చేస్తున్నామని.. అక్కడ డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ సజావుగా సాగుతోందని తెలిపింది. భారీ డిమాండ్ సమయంలో ప్రతి బుకింగ్ విజయవంతం కావడం సాధ్యం కాదని, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports