Womens Asia Cup 2026: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. 55 పరుగులకే కుప్పకూలిన దాయాది జట్టు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహిళల ఆసియా కప్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. శ్రీ చరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లతో అదరగొట్టడంతో ప్రత్యర్థిని టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితం చేసి సునాయస విజయం దిశగా నిలిచింది.

News18
News18

మహిళల ఆసియా కప్‌-2026 టోర్నీలో భారత జట్టు అదరగొట్టింది. దాయాది దేశం పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు. భారత స్పిన్నర్ల దెబ్బకు పాకిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచారు. సీనియర్ బౌలర్ దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా, షెఫాలీ వర్మ ఒక వికెట్ దక్కించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports