Last Updated:
యశ్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ వీడియో వదలడంతో ఆన్ లైన్ మాధ్యమాలు షేకై పోతున్నాయి. ఈ వీడియోలో కియారాతో యశ్ చేసిన రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కన్నడ రాకింగ్ స్టార్, పాన్ ఇండియా సెన్సేషన్ యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహీ’ (Tabaahi) సాంగ్ విడుదల చేశారు. అయితే, ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌లో భారీ వ్యూస్ రాబడుతూనే, మరోవైపు తీవ్ర విమర్శలు, ట్రోల్స్‌కి గురవుతుండటం గమనార్హం.
బాలీవుడ్ స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా సంగీతం అందించి, స్వయంగా ఆలపించిన ఈ ‘తబాహీ’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ఈ పాట విజువల్స్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి.
వింటేజ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్, రెట్రో కార్లు, వర్షంలో సాగే ఈ సాంగ్ మేకింగ్ రిచ్‌నెస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కానీ, ఇందులో యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) మధ్య కెమిస్ట్రీ శృతి మించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఘాటైన లిప్‌లాక్స్, మితిమీరిన రొమాన్స్ ఉండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరైతే దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. “ఈ వీడియో చూస్తుంటే ఏదో కండోమ్ యాడ్‌లా ఉంది” అంటున్నారు. ఒకప్పుడు తన కుటుంబంతో కలిసి చూడలేని అసౌకర్యమైన రొమాంటిక్ సీన్స్ తాను చేయనని చెప్పిన యశ్, ఇప్పుడు కియారాతో ఇంత బోల్డ్‌గా రెచ్చిపోయి నటించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కంటే ఈ రేంజ్ రొమాన్స్ అవసరమా? రొమాన్స్ కోసమే ఈ సినిమా తీశారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ‘టాక్సిక్’ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే, ఇది మల్టీ-స్టారర్ రేంజ్‌లో ఉండబోతోంది. ఇటీవలే విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 26, 2026 న పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ‘తబాహీ’ పాట సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేయడంతో పాటు, తన బోల్డ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 09, 2026 10:27 AM IST













