Last Updated:
రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో కొంత తడబడింది. దీంతో యశ్ పై ట్రోల్స్ నడుస్తుండగా.. తాజాగా దీనిపై సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత రియాక్ట్ అయింది.
కేజీఎఫ్ (KGF) చాప్టర్ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా, బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టుపై మొదటి నుంచి దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిని అందుకోవడంలో కొంత తడబడింది. యశ్ తన అద్భుతమైన నటన, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టినప్పటికీ.. సినిమా మేకింగ్, నెమ్మదిగా సాగే కథనంపై సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకులు పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో శాండల్‌వుడ్ ప్రముఖులు యశ్‌కు బాసటగా నిలుస్తున్నారు.














