Zojila Tunnel | గడ్కరీ చేతుల మీదుగా జోజిలా టన్నెల్ బ్లాస్ట్! | ACTPnews

Zojila Tunnel  | గడ్కరీ చేతుల మీదుగా జోజిలా టన్నెల్ బ్లాస్ట్!



భారత రక్షణ, రవాణా రంగాల్లో సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది! అత్యంత ప్రతిష్టాత్మకమైన “జోజిలా సొరంగ మార్గం” (Zojila Tunnel) నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల బ్రేక్థ్రూ ప్రదేశాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి విజయవంతంగా పేల్చివేశారు (Breakthrough Blast). ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో మేఘా ఇంజనీరింగ్ (MEIL) నిర్మిస్తున్న ఈ సొరంగం వల్ల కశ్మీర్ లోయ – లద్దాఖ్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఆ అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports