Last Updated:
ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయక నాయకుడని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసించారు. ఆయన నిర్ణయాలు ఎంతో వివేకంతో ఉంటాయని కొనియాడారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటనలు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం, వివేకంతో కూడిన నిర్ణయాలపై బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ తీవ్ర ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఉన్న అత్యంత స్ఫూర్తిదాయక నాయకుల్లో మోదీ ఒకరని ఆయన కీర్తించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఇండియా-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్టీఏ) ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ప్రపంచ దేశాల అధినేతల ప్రసంగాలు వింటే భయం, ఆందోళన కలుగుతాయని, కానీ ప్రధాని మోదీ మాటలు వింటే ఆయన చెప్పింది చేయాలనే భావన కలుగుతుందని అన్నారు.














