Last Updated:
పాకిస్తాన్ ప్రధాని ఇటీవల తాలిబాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌తో కలిసి తాలిబాన్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో రష్యా తాలిబాన్‌తో సైనిక సహకారాన్ని పెంచేందుకు ముందుకు రావడం ఇస్లామాబాద్‌కు పెద్ద షాక్‌గా మారింది.
రష్యా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒకప్పుడు తీవ్ర శత్రుత్వం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా ఈ రెండు దేశాలు రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ డిఫెన్స్ డీల్‌లో ఏమేమి అంశాలు ఉన్నాయన్న పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, ఇది అమెరికా, పాకిస్తాన్‌కు కొత్త ఆందోళనలకు దారితీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇటీవల తాలిబాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌తో కలిసి తాలిబాన్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో రష్యా తాలిబాన్‌తో సైనిక సహకారాన్ని పెంచేందుకు ముందుకు రావడం ఇస్లామాబాద్‌కు పెద్ద షాక్‌గా మారింది. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సమావేశంలో ఈ ఒప్పందానికి ఆమోదం లభించింది. ఈ కార్యక్రమానికి తాలిబాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ సహా పలువురు ఉన్నత నేతలు హాజరయ్యారని న్యూస్ 18 హింది తన కథనంలో రాసింది.
Russia and Taliban Sign Military-Technical Cooperation Agreement in Moscow
During an official visit to Moscow, the Taliban’s Defense Minister, Mullah Yaqoob Mujahid, signed a military-technical cooperation agreement with the Russian side at the inaugural International Security… pic.twitter.com/6iV4GUOjE3
— Aamaj News English (@aamajnews_EN) May 28, 2026
2025 జూలైలో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తర్వాత రష్యా ఇప్పుడు మరింత లోతైన రక్షణ సంబంధాల దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ఒప్పందంలో ఆయుధాల సరఫరా, శిక్షణ, సాంకేతిక సహాయం వంటి అంశాలు ఉన్నాయా అనే విషయాన్ని రెండు దేశాలు అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, రష్యా ఆఫ్ఘనిస్తాన్‌కు ఆధునిక యుద్ధ విమానాలు లేదా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందించే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి.
పాకిస్తాన్‌కు ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సమస్యపై గత కొన్నేళ్లుగా పాకిస్తాన్-తాలిబాన్ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పాకిస్తాన్ భూభాగంపై దాడులకు ఆఫ్ఘన్ నేల ఉపయోగపడుతోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా, తాలిబాన్ మాత్రం వాటిని ఖండిస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి సైనిక మద్దతు లభిస్తే తాలిబాన్ మరింత బలపడే అవకాశముందని భావిస్తున్నారు.
ఇక ఈ ఒప్పందం వెనుక రష్యాకు కూడా వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ISIS-K వంటి ఉగ్రవాద సంస్థల ప్రభావం మధ్య ఆసియా దేశాలకు విస్తరించకుండా అడ్డుకోవడమే మాస్కో ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ వరకు ఈ ముప్పు పెరిగే అవకాశం ఉందని రష్యా భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతాల్లో తాలిబాన్ నియంత్రణ బలపడాలని రష్యా కోరుకుంటోంది.
ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన అంశం చరిత్రలోని మలుపే. 1980లలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం చేసిన సమయంలో అదే ప్రాంతంలో ముజాహిద్దీన్ బలగాలు పోరాడాయి. తరువాత అదే బలగాల నుంచి తాలిబాన్ ఏర్పడింది. ఇప్పుడు అదే రష్యా తాలిబాన్‌తో రక్షణ భాగస్వామ్యం కుదుర్చుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషించబడుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













