అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ | Medicover Hospitals has launched Advanced Eye Center at Hi-Tech City | బిజినెస్ | ACTPnews

అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్


Last Updated:

మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించింది. ముఖ్య అతిథిగా సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని పాల్గొన్నారు.

అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఐ సెంటర్‌లో కాటరాక్ట్, రెటినా, రిఫ్రాక్టివ్, కార్నియా, న్యూరో-ఆఫ్తాల్మాలజీ సేవలను ఒకే చోట అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణుల బృందం ద్వారా ప్రపంచ స్థాయి నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స సేవలను ఈ కేంద్రం అందించనుంది. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నాన్ని అభినందించారు.

కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆమె తెలిపారు. ఈ కేంద్రంలో ప్రత్యేక రెటినా, విట్రియో-రెటినల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెటినా లేజర్ చికిత్సలు, ప్రీమేచ్యూర్ శిశువుల్లో వచ్చే రెటినోపతి ఆఫ్ ప్రీమ్యాచ్యూరిటీ (ROP) చికిత్స, డయాబెటిక్ విట్రెక్టమీ, రెటినల్ డిటాచ్‌మెంట్ శస్త్రచికిత్సలు, యువియాటిస్ నిర్వహణ, కాటరాక్ట్ శస్త్రచికిత్స అనంతర సమస్యల చికిత్సలు ఉన్నాయి. అలాగే క్లిష్టమైన కంటి-నర సంబంధిత సమస్యలకు న్యూరో ఆఫ్తాల్మాలజీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Medicover Hospital Hyderabad, eye center inauguration, Advanced eye care services Hyderabad, Cataract surgery, Retina treatment, diabetic retinopathy, Akkineni amala, మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్ కంటి కేంద్ర ప్రారంభోత్సవం, కాటరాక్ట్ శస్త్రచికిత్స, డయాబెటిక్ రెటినోపతి, న్యూరో ఆఫ్తాల్మాలజీ సేవలు, అక్కినేని అమల

కాటరాక్ట్ చికిత్స విభాగంలో ఫేకోఎమల్సిఫికేషన్‌తో ఫోల్డబుల్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ (IOL) అమరిక, స్మాల్ ఇన్సిషన్ కాటరాక్ట్ సర్జరీ వంటి ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సెంటర్ సన్నద్ధమైంది. వీటి ద్వారా రోగులకు త్వరితగతిన కోలుకునే అవకాశం, మెరుగైన చూపు లభిస్తుంది. అదేవిధంగా LASIK, SMILE, PRK, రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్, ఇంప్లాంటబుల్ కాలామర్ లెన్స్ (ICL), కెరటోకోనస్‌కు కార్నియల్ కొలాజెన్ క్రాస్‌లింకింగ్ (C3R) వంటి ఆధునిక రిఫ్రాక్టివ్, కార్నియా చికిత్సలు కూడా అందించనున్నారు.

ఇంకా ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు, YAG క్యాప్సులోటమీ, పెరిఫెరల్ YAG ఇరిడోటమీ, చలేజియన్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్, తరచూ వచ్చే చలేజియన్ సమస్యలకు ఇంట్రాలెషనల్ స్టెరాయిడ్ చికిత్సలు వంటి సమగ్ర నేత్ర వైద్య సేవలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. ఈ అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం ద్వారా తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో కంటి వైద్య సేవలను అందించాలనే తమ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

Medicover Hospital Hyderabad, eye center inauguration, Advanced eye care services Hyderabad, Cataract surgery, Retina treatment, diabetic retinopathy, Akkineni amala, మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్ కంటి కేంద్ర ప్రారంభోత్సవం, కాటరాక్ట్ శస్త్రచికిత్స, డయాబెటిక్ రెటినోపతి, న్యూరో ఆఫ్తాల్మాలజీ సేవలు, అక్కినేని అమల

ప్రస్తుతం డయాబెటిస్ కారణంగా వచ్చే రెటినా సమస్యలు, కాటరాక్ట్, రిఫ్రాక్టివ్ లోపాలు, జీవనశైలి కారణమైన కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమయానుకూలంగా ఆధారబద్ధమైన వైద్య సేవలను ఈ సెంటర్ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్నా మైనేని (సీనియర్ కన్సల్టెంట్ – రెటినా & యువియాటిస్), డాక్టర్ హరినాథ్ బాబు కార్లపూడి (కన్సల్టెంట్ ఆఫ్తాల్మాలజిస్ట్), డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ వీరగంధం (సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్), డాక్టర్ రామకృష్ణ రావూరి (హెడ్ – అనస్తీషియాలజీ విభాగం), మహేష్ డెగ్లూర్కర్ (చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్), డాక్టర్ జానకిరామ్ (రీజినల్ డైరెక్టర్), శ్రీకాంత్ (సెంటర్ హెడ్) పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *