ఇండొనేసియాలో భారీ భూకంపం.. తీవ్రత 7.7గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఇండొనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోరెస్ కి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇండొనేసియాలోని ఈస్ట్ నుసా తెంగ్గరా ప్రావిన్స్‌లోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైంది. ఎపిసెంటర్ ఎండే నగరానికి ఉత్తర-వాయవ్య దిశగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్రంలో ఉంది. లోతు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇది ప్రమాదకర భూకంపంగా చెబుతున్నారు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 5:58 గంటలకు (సెంట్రల్ ఇండొనేసియన్ టైమ్) ఈ కంపనం వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports