టెలికాం రంగంలో చరిత్ర.. ప్రపంచంలోనే తొలి 5G రోమింగ్ సాధించిన జియో, టీ-మొబైల్! | బిజినెస్ | ACTPnews

News18


Last Updated:

రిలయన్స్ జియో, టీ-మొబైల్ సంస్థలు టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి 5G స్టాండలోన్ (SA) రోమింగ్ కనెక్షన్‌ను విజయవంతంగా పరీక్షించాయి. దీనివల్ల విదేశీ ప్రయాణాల్లోనూ అత్యంత వేగవంతమైన 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి.

News18
News18

అంతర్జాతీయ టెలికాం రంగంలో భారతీయ దిగ్గజం రిలయన్స్ జియో, అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్క్ టీ-మొబైల్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. సిన్వర్స్ (Syniverse) సంస్థ సాంకేతిక సహకారంతో ప్రపంచంలోనే మొట్టమొదటి 5G స్టాండలోన్ (SA) రోమింగ్ కనెక్షన్‌ను విజయవంతంగా సాధించాయి. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా సొంత దేశంలో ఉన్నట్లే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై టీ-మొబైల్, జియో కస్టమర్లు అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ట్రూ 5G రోమింగ్ సేవలను ఆస్వాదించవచ్చు.

ఇప్పటివరకు ఏ నెట్‌వర్క్ కూడా ఇలాంటి అత్యాధునిక 5G రోమింగ్ సేవలను తీసుకురాలేదు. ఈ సరికొత్త 5G స్టాండలోన్ టెక్నాలజీ ద్వారా అత్యధిక డేటా వేగం, అతి తక్కువ లేటెన్సీతో పాటు ఎలాంటి అంతరాయం లేని నమ్మకమైన కనెక్షన్ లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), రియల్ టైమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్ అవసరాలకు ఈ టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది.

సరికొత్త శకానికి నాంది ఈ చారిత్రక విజయంపై టీ-మొబైల్ చీఫ్ నెట్‌వర్క్ ఆఫీసర్ అంకుర్ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లో ఇది ఎంతో కీలక అడుగని ఆయన అన్నారు. 2020లో ప్రారంభించిన ఈ 5G స్టాండలోన్ ప్రయాణం, జియో భాగస్వామ్యంతో ఇప్పుడు సరికొత్త స్థాయికి చేరిందని తెలిపారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియోలు స్ట్రీమ్ చేయవచ్చని చెప్పారు.

జియో అంతర్జాతీయ నెట్‌వర్క్ హెడ్ మార్క్ యార్కోస్కీ మాట్లాడుతూ.. ఇది కేవలం రోమింగ్ సేవ మాత్రమే కాదని స్పష్టం చేశారు. రెండు అగ్రగామి 5G నెట్‌వర్క్‌లు కలిస్తే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో ఈ ప్రయోగం నిరూపించిందన్నారు. వినియోగదారులకు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు అందించడానికి ఈ టెక్నాలజీ బలమైన పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ క్రాస్-బోర్డర్ 5G సేవలను సాకారం చేయడంలో సిన్వర్స్ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించింది. అత్యంత సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్‌కనెక్షన్ అందించడం ద్వారా ఈ అద్భుతం సాధ్యమైందని సిన్వర్స్ ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports