Last Updated:
తిరుమల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సెప్టెంబర్ 15 నుండి 23 వరకు సాలకట్ల, అక్టోబర్ 13 నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. భక్తులకు పార్కింగ్, తాగునీరు, ఆహారం, భద్రతపై ప్రత్యేక దృష్టి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. టీటీడీతో సమన్వయం చేసుకుంటూ భక్తుల సులభ దర్శనమే లక్ష్యంగా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు.













