Last Updated:
కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే నామినేషన్స్, టాస్క్‌ల కంటే ముందే గొడవలు మొదలయ్యాయి. వాతావరణం అప్పుడే రణరంగాన్ని తలపిస్తోంది. మరి తొలి రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామా..
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ (Bigg Boss Telugu Season 10) గ్రాండ్ లాంచ్ అయింది. అయితే కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే నామినేషన్స్, టాస్క్‌ల కంటే ముందే గొడవలు మొదలయ్యాయి. వాతావరణం అప్పుడే రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం రాత్రి ప్రసారమైన తొలి ఎపిసోడ్లో టాలీవుడ్ నటుడు త్రిగుణ్, అలాగే అగ్నిపరీక్ష టీమ్ కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన వాడీవేడి వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా త్రిగుణ్ కావాలనే రోహిత్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు వినిపించాయి.














