నాడు 3000.. నేడు 54,000 కిలోమీటర్లు.. మోదీ హయాంలో దేశ రహదారుల ప్రగతి ప్రయాణం! | | ACTPnews

News18


Last Updated:

స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంతో పోలిస్తే, గడిచిన పదేళ్ల మోదీ పాలనలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా పుంజుకుంది. రోడ్ల నెట్‌వర్క్ దాదాపు 60 శాతం వృద్ధి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

News18
News18

భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి తరుణంలో దేశ అభివృద్ధికి నిదర్శనమైన జాతీయ రహదారుల నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 1951 నుండి 1961 మధ్య నెహ్రూ హయాంలో దేశంలో కేవలం 3,987 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో పునాదులు పడుతున్న కాలం కావడం వల్ల రోడ్ల విస్తరణ వేగం చాలా పరిమితంగా సాగింది. కానీ, గత పదేళ్ల మోదీ పాలనలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతో మౌలిక వసతుల కల్పనలో ఊహించని మార్పు వచ్చింది. 2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న హైవేల నెట్‌వర్క్, 2024 నాటికి ఏకంగా 1,46,195 కిలోమీటర్లకు చేరుకుంది. అంటే దాదాపు 54,908 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు దేశ ఆర్థిక రంగానికి తోడయ్యాయి.

ఈ మార్పు కేవలం పొడవులోనే కాదు, రోడ్ల నాణ్యతలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 18,278 కిలోమీటర్లు ఉన్న నాలుగు వరుసల రహదారులు ఇప్పుడు 45,947 కిలోమీటర్లకు పెరిగాయి. హైస్పీడ్ కారిడార్లు కూడా 93 కిలోమీటర్ల నుండి 2,474 కిలోమీటర్లకు విస్తరించాయి.

రోడ్ల నిర్మాణ వేగం 2014లో రోజుకు 12 కిలోమీటర్లు ఉండగా, 2020-21 నాటికి అది రికార్డు స్థాయిలో 36.5 కిలోమీటర్లకు చేరింది. ప్రస్తుతం రోజూ సగటున 28 కిలోమీటర్ల పైగా రహదారులు నిర్మిస్తున్నారు. దీనికి అదనంగా ప్రపంచంలోనే అతిపొడవైన ‘అటల్ టన్నెల్’ లాంటి వ్యూహాత్మక కట్టడాలు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయి.

భారత్‌మాల పరియోజన, పీఎం గతి శక్తి వంటి ప్రతిష్టాత్మక పథకాలు రవాణా ఖర్చులను తగ్గించి, వ్యాపారాలను వేగవంతం చేశాయి. అవసరాల కోసం రోడ్లు వేసే స్థితి నుండి, దేశ ప్రగతికి హైవేలే ప్రధాన వ్యూహం అనే స్థాయికి భారత్ చేరుకుంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *