Last Updated:
భారతీయులకు ఇచ్చే ఈబీ-1 గ్రీన్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. వీసా కోటా త్వరలోనే ముగియనుండటంతో భారత టెక్కీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఉద్యోగ ఆధారిత తొలి ప్రాధాన్యత కేటగిరీ అయిన ఈబీ-1 (EB-1) వీసాల జారీని త్వరలోనే తాత్కాలికంగా నిలిపివేసే అవకాశముందని అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన తాజా వీసా బులెటిన్లో ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ లోపే భారతీయులకు కేటాయించిన పరిమితి కోటా వీసాలు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.














