మిర్జాపూర్: ది మూవీ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు రిలీజ్.. ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మిర్జాపూర్: ది మూవీ టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు.

News18
News18

మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మూవీ రాబోతోంది. మిర్జాపూర్: ది మూవీ టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.

ఈ పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మిర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న మిర్జాపూర్: ది మూవీ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాసిమ్ జగ్‌మాగియా, విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed