మూఢనమ్మకాల నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్.. నిమ్మకాయ నీకుందుకు భయం మూవీ స్టార్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా విభిన్న కథా చిత్రం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ ఘనంగా ప్రారంభమైంది. మూఢనమ్మకాల నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

News18
News18

ఆధునిక కాలంలోనూ ఎక్కడోచోట మూఢనమ్మకాల ప్రభావం కనిపిస్తోంది. వాటిని ఎండగడుతూ ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా విభిన్న కథా చిత్రం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాగా, తొలి షాట్ కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. పలువురు అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కథలో హారర్, థ్రిల్లర్ అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నటి ఆమనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి. చిన్న సినిమాలు నిలబడితేనే సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది” అని అన్నారు.

దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ.. “ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ‘నిమ్మకాయ’ చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. సుమన్, ఆమనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు” అని తెలిపారు.

హీరో రాజేష్ భూపతి మాట్లాడుతూ.. “ఇది నాకు తొలి చిత్రం. నిమ్మకాయను ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలతో అనుసంధానించి చూస్తుంటారు. అలాంటి అంశాలను కొత్త కోణంలో నిజాలను చూపించే ప్రయత్నం ఈ సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు” అన్నారు.

పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. “కలియుగ వెంకటేశ్వర స్వామి పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సుమన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ.. “మా ఆహ్వానాన్ని స్వీకరించి, చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన వినోదాన్ని అందించే మంచి చిత్రాన్ని రూపొందించేందుకు మా బృందం అంకితభావంతో పనిచేస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

రాజేష్ భూపతి,స్వప్నరాజ్, అబిత, ప్రముఖ నటుడు సుమన్, ఆమని, తనికెళ్ళభరణి, రవిబాబు, టార్జాన్, బెంగళూరు అవినాష్, గడ్డం నవీన్, పుష్ప జగదీష్, సుమన్ శెట్టి, జబర్దస్త్ రాజమౌళి, శాంతి, హంస, సత్య తదితరులు నటిస్తున్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports