రఫాడించిన SRH బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐపీఎల్ 2026లో పంజాబ్‌పై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్లకు 235 పరుగులు చేసింది, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 అజేయం, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఆరంభం

News18
News18

ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (38), అభిషేక్ శర్మ (35) జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేసిన క్లాసెన్ కేవలం 43 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (29) కూడా వేగంగా ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, వైశాక్, ఫర్గూసెర్ చెరో వికెట్ పడగొట్టారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports