Last Updated:
దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫస్ట్ మూవీ వెంకట్రామయ్య గారి తాలూకా జులై నెలలో రిలీజ్ కానుంది.
దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ..నేను కోమలి ఫోక్ సింగర్ గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక ద్యేయంతో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రాన్ని పూర్తి చేసాము. ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు నేను పడిన కష్టం పడిన మాటలు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు అన్ని కష్టాలు ఎదుర్కుని జులై లో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాము. మా సినిమాకి మీడియా సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు సతీష్ అవాల మాట్లాడుతూ.. మా “వెంకట్రామయ్య గారి తాలూకా”
చిత్రన్ని జులై లో విడుదల కానుండి త్వరలోనే డేట్ ఫైనల్ చేసి ఆపిషియల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాము. మా కథ విషయానికోస్తే అందమైన ఒక పల్లెటూరు లో వెంకట్రమయ్య అనే పరువుగల కుటుంబం లోజరిగే ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బు తో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు గా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లి తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా. “వెంకట్రామయ్య గారి తాలూకా” మంచి ఫ్యామిలీ డ్రామాని కుటుంబం తో కలిసి థియేటర్ కి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని తెరకేకించాం అని తెలిపారు.
ఈ సినిమాలో దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని,యామిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ టాలీవుడ్‌లో హీరోగా ల్యాంచ్ అవ్వగా, ఇప్పుడు ఆయన కుమార్తె తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













