Last Updated:
రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీయే (NDA) పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని (UCC) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ముంబైలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల లోపు భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న మొత్తం 21 రాష్ట్రాల్లో యూసీసీని కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఒకే దేశం, ఒకే చట్టం విధానం బీజేపీ ప్రధాన ఎజెండా అని, దీన్ని సాకారం చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఆయన వివరించారు.














