గ్రాండ్‌గా పోలీస్ కంప్లైంట్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వరలక్ష్మి శరత్‌ కుమార్‌పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

గ్రాండ్‌గా పోలీస్ కంప్లైంట్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వరలక్ష్మి శరత్‌ కుమార్‌పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు


ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన‌లేద‌ని చిత్ర‌యూనిట్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆమె ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ను సంప్ర‌దించారు. ఈ వివాదాన్ని పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కరించుకున్నామని చెప్పాను. దీంతో దర్శకుడు సంజీవ్ మేగోటి గారు త‌న త‌ప్పు లేక‌పోయినా వ‌ర‌లక్ష్మికి సారీ చెప్పారు. ఆయ‌న‌ ప్రదర్శించిన వినయం, సహనమే ఈ విజయానికి మరో కారణమని పేర్కొన్నారు. సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు సాగడం ఇండస్ట్రీకి కూడా శుభపరిణామమని అన్నారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “మా చిత్ర హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ ల‌క్ష రేట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్ర‌స‌న్న కుమార్ వంటి పెద్ద‌ల సూచ‌న మేర‌కే ఆమెకు సారీ చెప్ప‌డం జ‌రిగింది. అంతేకానీ, స‌మ‌స్య పూర్తి స‌ర్దుమ‌ణిగింద‌ని కూడా చెప్ప‌లేను. మొత్తానికి ఒక వివాదంతో స‌త‌మ‌తం అయ్యాం.. చివ‌రికి విజ‌యంతో శుభం కార్డు ప‌డింద‌ని భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుద‌లైన రెండ‌వ రోజు నుంచే థియేట‌ర్‌లు పెరుగుతున్నాయి. దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. సూపర్ స్టార్ కృష్ణగారికి నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు సంతృప్తిగా స్పందించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది” అని అన్నారు.

అలాగే, “52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ కథలో హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను సమన్వయం చేశాం. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, “సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణగారిని గుర్తు చేసే పాటలో నటించడం నాకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూసే మంచి వినోదాత్మక చిత్రం ఇది” అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ, “వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు, స్నేహితులు ఫోన్ చేసి సినిమా గురించి ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శకుడు సంజీవ్ మేగోటి గారికి ధన్యవాదాలు” అన్నారు. నటుడు విజయభాస్కర్ మాట్లాడుతూ, “కర్మ సిద్ధాంతం ఆధారంగా తెరకెక్కిన ఈ కథ నాకు చాలా నచ్చింది. ‘బతుకమ్మ’ సినిమా తర్వాత నాకు ఈ స్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రం ఇదే. ఈ సినిమాలో చేసిన పోలీస్ పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది” అని చెప్పారు.

నిర్మాత ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమాలో ప్రతి నటుడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రేక్షకుల ఆదరణ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది” అన్నారు. హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, ప్రీతి సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed