బోనాలకు వెళ్లే ఆడపడుచులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈసారి గుళ్ల దగ్గర కొత్తగా.. | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

మునుపెన్నడూ లేని విధంగా బోనాలు.. ఆ మూడు నగరపాలక సంస్థల ప్రజలకు ఇక పండగే పండగ!

News18
News18

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాలు ఈ ఏడాది మరింత ఘనంగా జరగనున్నాయి. గతంలో ఒకే నగరపాలక సంస్థ పరిధికి పరిమితమైన ఈ ఉత్సవాలను ఈసారి హైదరాబాద్ పరిధిలోని మూడు నగరపాలక సంస్థల్లో కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. జూలై 16న చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అమ్మవారి ఆలయాల్లో ఈ ఆధ్యాత్మిక సంబరాలు వైభవంగా సాగనున్నాయి.

బోనాల ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ కేంద్రం నుంచి మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజరుద్దీన్, డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా రూ.20 కోట్లు కేటాయించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం.. కీలక మలుపు!

ప్రభుత్వం కేటాయించిన నిధులను ప్రధానంగా ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సద్వినియోగం చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణలు, భద్రత కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అత్యవసరమని స్పష్టం చేశారు. అలాగే త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.

ఇది కూడా చదవండి: Streenidhi Loan: డ్వాక్రా మహిళలకు పండగే.. రూ.17 లక్షలు రుణం!

మహిళలు, వృద్ధుల సౌకర్యార్థం ఈసారి బోనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పసిపిల్లల తల్లుల కోసం ఆలయాల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా చనుబాలు ఇచ్చే గదులను ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా మహిళా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. ఆ రద్దీకి తగ్గట్టుగా అదనపు బస్సులు నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆమె కోరారు.

ఆషాడ మాసం మొత్తం తెలంగాణ పల్లెలు, పట్నాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా జరిగే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, పోతురాజుల వీరంగం, రంగం, సాగనంపు లాంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తిశ్రద్ధలతో తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు కనీస ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి గుర్తుచేశారు. అంకితభావంతో పనిచేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేసి తెలంగాణ సంస్కృతిని దశదిశలా చాటాలని ఆమె పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed