Team India: ఫ్లాట్ పిచ్‌లపై పులులు.. బౌలింగ్ పిచ్‌లపై పిల్లులు.. డేంజరస్ ఓపెనర్లకు ఇచ్చిపడేసిన మాజీ ప్లేయర్ | క్రీడా వార్తలు | ACTPnews

టీమిండియా


Last Updated:

Team India: టీమిండియా యువ విధ్వంసకర బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల ఆటతీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర విశ్లేషణ చేశారు.

టీమిండియా
టీమిండియా

వీరిద్దరిలో అపారమైన టాలెంట్, సిక్సర్లు బాదే అద్భుత సామర్థ్యం ఉన్నాయని కొనియాడిన ఆయన.. విదేశీ పిచ్‌లపై పేస్, స్వింగ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇద్దరూ తడబడుతున్నారని స్పష్టం చేశారు. స్వదేశీ గడ్డపై చెలరేగిపోయే ఈ యువ ఆటగాళ్లు, విదేశాల్లోనూ అదే జోరును ప్రదర్శించాలంటే తమ టెక్నిక్‌ను మరింత పదును పెట్టుకోవాలని హితవు పలికారు.

ముఖ్యంగా బంతి సీమ్, స్వింగ్ అవుతున్న వేళ వీరి బలహీనతలు బయటపడుతున్నాయని, ఇంగ్లాండ్ పర్యటనలో ఈ లోపం స్పష్టంగా కనిపించిందని పాటిల్ గుర్తుచేశారు. భారత్‌లో చూపించే దూకుడును సీమ్ అనుకూల పరిస్థితుల్లోనూ కొనసాగించేందుకు ఈ ద్వయం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

గత జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ 131 పరుగులు చేయగా, ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన వైభవ్ మూడు మ్యాచుల్లో 42 పరుగులు మాత్రమే రాబట్టాడు. బంతి ఎక్కువగా స్వింగ్ అయిన ఆ పరిస్థితుల్లో ఈ ఇద్దరి బ్యాటింగ్ లోపాలు చర్చనీయాంశమయ్యాయని ఆయన వివరించారు.

అయితే ఆ తర్వాతి పర్యటనల్లో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్నారు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును, ఆఖరి పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు, ఆఫ్గానిస్థాన్‌పై టీమిండియా సాధించిన 3-0 సిరీస్ విజయంలో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు. నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిషేక్ బ్యాటింగ్ శైలి తెలిసిన వ్యక్తిగా ఆ ఇన్నింగ్స్ చూసి తనేమీ ఆశ్చర్యపోలేదని పాటిల్ అన్నారు.

ప్రస్తుత ఆధునిక టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు తొలి బంతి నుంచే నిర్భయంగా ఆడే స్వేచ్ఛ దక్కుతోందని, అభిషేక్, వైభవ్ ఆ అవకాశాన్ని చక్కగా వాడుకుంటున్నారని పాటిల్ ప్రశంసించారు. ఇద్దరి వద్దా అద్భుతమైన పవర్ హిట్టింగ్, టైమింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ, విదేశీ గడ్డపై పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు కూడా ఈ దూకుడును కొనసాగించడమే అసలైన సవాలని ఆయన స్పష్టం చేశారు. పేస్‌కు అనుకూలించే విదేశీ పిచ్‌లపై స్వింగ్ అవుతున్న బంతులను సమర్థంగా ఎదుర్కొనే మెళకువలు నేర్చుకుంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో వీరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని సందీప్ పాటిల్ సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed