Birth Tourism: అమెరికాలో ‘బర్త్ టూరిజం’పై ఉక్కుపాదం.. వీసా నిబంధనల్లో కఠిన ఆంక్షలు! | | ACTPnews

News18


Last Updated:

పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఆశతో గర్భిణులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లే విదేశీయులపై అగ్రరాజ్యం కొరడా ఝుళిపించింది. వాణిజ్యపరంగా సాగుతున్న ఈ ‘బర్త్ టూరిజం’ను అడ్డుకునేందుకు వీసా నిబంధనల్లో కొత్త ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

News18
News18

అగ్రరాజ్యం అమెరికా విదేశీ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. పుట్టబోయే బిడ్డకు సులభంగా అమెరికా పౌరసత్వం దక్కాలనే ఉద్దేశంతో గర్భిణులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లే ట్రెండ్ ఈమధ్య బాగా పెరిగింది. దీన్నే ‘బర్త్ టూరిజం’ అని పిలుస్తారు. ఇలాంటి ప్రయాణాలను అరికట్టేందుకు అమెరికా విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వాణిజ్యపరంగా బర్త్ టూరిజంను ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెప్టెంబర్ 23న అధికారికంగా ప్రకటించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. కేవలం పిల్లలకు పౌరసత్వం ఇప్పించడానికే విదేశీయులను అమెరికాకు రప్పించే నెట్‌వర్క్‌లను టార్గెట్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ చట్టం కింద ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. వీసా అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చేలా ప్రోత్సహించే ఏజెంట్లు, బర్త్ టూరిజం నెట్‌వర్క్ నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మార్కో రూబియో తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ తరహా అక్రమాలకు పాల్పడితే శిక్షలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

బర్త్ టూరిజం అంటే ఏమిటి?

గర్భంతో ఉన్న మహిళలు ప్రసవం కోసం మరో దేశానికి వెళ్లడాన్ని సాధారణంగా బర్త్ టూరిజం అంటారు. అక్కడ బిడ్డ పుడితే ఆ దేశ నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. అమెరికా పాస్‌పోర్ట్ ఎంతో శక్తివంతమైనది కావడంతో పాటు, అక్కడ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశతో చాలామంది విదేశీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఐటీ నిపుణులు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుండగా, ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.

అయితే గర్భిణులు అమెరికాకు రావడంపై ఎలాంటి పూర్తిస్థాయి నిషేధం విధించలేదు. కేవలం ప్రసవం కోసమే విదేశీయులు అమెరికాకు రావడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. తాజాగా తీసుకువచ్చిన విధానం ప్రధానంగా ఈ బర్త్ టూరిజంను వ్యాపారంగా మార్చుకున్న నెట్‌వర్క్‌లను టార్గెట్ చేసింది. భారీగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు సమాచారంతో వీసాలు ఇప్పించే ఏజెంట్లు, వీరికి వైద్య సేవలు అందించే ఆస్పత్రులు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు.

The US is preparing for one of its largest visa revocation drives, with reports suggesting that up to 200,000 people may be affected. (Photo: AP)
హెచ్-1బీ, ఇతర వీసాల్లో మార్పులు

బర్త్ టూరిజం ఆంక్షలతో పాటు అమెరికా మరికొన్ని వీసా నిబంధనల్లోనూ కీలక మార్పులు చేసింది. సెప్టెంబర్ 18న జారీ చేసిన మరో ఉత్తర్వుల ప్రకారం, కొన్ని ప్రత్యేక హెచ్-1బీ (H-1B) వీసాల ఎంట్రీపై ఉన్న ఆంక్షలను సెప్టెంబర్ 2027 వరకు పొడిగించారు. దీనికి సంబంధించి పిటిషన్లకు దాదాపు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సుమారు 39 దేశాల పౌరులకు కొత్త వీసాల జారీని పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వీసా బాండ్ ప్రోగ్రామ్‌ను ఆగస్టులో శాశ్వతం చేశారు. కాన్సులర్ అధికారుల నిర్ణయం మేరకు బీ-1/బీ-2 దరఖాస్తుదారులు నిర్దిష్ట బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా మరింత పెరగనుంది. మీడియా, ఇతర వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్‌లో ఉంచాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

విద్యార్థులకు దక్కిన ఊరట

అంతర్జాతీయ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లకు మాత్రం అమెరికా కోర్టుల ద్వారా కాస్త ఊరట దక్కింది. ఎఫ్-1 (F-1), జే-1 (J-1) వీసాలకు నిర్దిష్ట కాలావధి విధించాలనే కొత్త రూల్ సెప్టెంబర్ 15 నుంచి అమలు కావాల్సి ఉండగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది. ప్రస్తుతానికి పాత విధానమే కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు అగ్రరాజ్యం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed