Last Updated:
బాలీవుడ్ పేరు మోసిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన మేకింగ్ గానీ, టేకింగ్ గానీ వేరే లెవల్‌లో ఉంటాయి. ఆయన తీసిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. మరీ ముఖ్యంగా ఈయన సినిమాలు విజువల్‌గా, పోయేటిక్‌గా అద్భుతంగా ఉంటాయి.
బాలీవుడ్ పేరు మోసిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన మేకింగ్ గానీ, టేకింగ్ గానీ వేరే లెవల్‌లో ఉంటాయి. ఆయన తీసిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. మరీ ముఖ్యంగా ఈయన సినిమాలు విజువల్‌గా, పోయేటిక్‌గా అద్భుతంగా ఉంటాయి. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో కమర్షియల్ హిట్టు కొట్టడంలే ఈయన దిట్ట. అందుకే ఈయన సినిమాలు ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అంతెందుకు ఈయనతో ఒక్క సినిమానైనా చేయాలి అనుకోని స్టార్ హీరోలుండరంటే అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో ‘లవ్&వార్’ సినిమా చేస్తున్నాడు.
అలాయా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. కాగా తాజాగా ఈ సినిమా నుంచి రణ్‌బీర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ వైపు రక్తంతో తడిసిన చేయి.. మరోవైపు కూల్‌గా స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేస్తూ.. క్రేజీగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ లవర్ బాయ్ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

రణ్‌బీర్ పాత్ర ఎలా ఉండబోతుంది? సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే ఆసక్తి ఈ ఫస్ట్ లుక్‌తో మరింత పెరిగింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకు ప్రత్యేకమైన గ్రాండ్ విజువల్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అద్భుతమైన సెట్స్, కలర్ టోన్ ఈ పోస్టర్‌లోనూ కనిపిస్తున్నాయి. ఒక్క పోస్టర్‌తోనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్ లుక్‌కు తగ్గట్టుగా పోస్టర్ డిజైన్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. పోస్టర్‌ను విడుదల చేసిన సమయంలో వినిపించిన మ్యూజిక్ విజువల్స్‌కు బాగా సెట్ కావడంతో భన్సాలీ మార్క్ మరోసారి కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడిగా మాత్రమే కాకుండా సంగీతంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే సంజయ్ లీలా భన్సాలీ.. ‘లవ్ & వార్’ విషయంలోనూ తనదైన ముద్రను చూపిస్తున్నట్లు ఈ చిన్న గ్లింప్స్‌తోనే అర్థమవుతోంది.
రణ్‌బీర్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్.. “వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్!” అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ క్యాప్షన్ కూడా రణ్‌బీర్ పాత్రలోని పవర్, ఇంటెన్సిటీపై ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కనిపించిన విధానం చూస్తే.. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి.
‘లవ్ & వార్’ కేవలం స్టార్ కాంబినేషన్‌తోనే కాకుండా భారీ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతోంది. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటిస్తున్న మరో సినిమా కావడంతో వారి అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సౌత్ ఆడియన్స్‌లో కూడా ‘లవ్ & వార్’పై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం విడుదలైన రణ్‌బీర్ ఫస్ట్ లుక్ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌పై క్యూరియాసిటీ పెంచింది.
భారీ తారాగణం, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందుతున్న ‘లవ్ & వార్’ 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ కొత్త అవతార్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.














