సముద్రంలో వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులు.. భారతీయుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో జైశంకర్ తీవ్ర ఆందోళన! | | ACTPnews

News18


Last Updated:

అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతుండటంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఈ దాడులను అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితి వేదికగా పిలుపునిచ్చారు.

News18
News18

అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న వరుస దాడులపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా వాణిజ్య నౌకలపై దాడులు సాధారణ విషయంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ‘ఎంవీ కెమ్ ప్లూటో’ అనే నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడని గుర్తుచేశారు.

అంతకు పది రోజుల ముందు హార్ముజ్ జలసంధి దాటుతున్న ‘అల్ గియా’ అనే చమురు నౌకపై జరిగిన దాడిలో మరో భారతీయుడు గల్లంతయ్యాడని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్ర రవాణా రంగంలో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో అతిపెద్ద నావికుల సరఫరాదారుగా అవతరించిన తరుణంలో, మన నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.

నల్ల సముద్రంలోనూ భారతీయుల మృతి

గల్ఫ్ ప్రాంతంతో పాటు నల్ల సముద్రంలో జరిగిన దాడుల్లోనూ భారతీయులు బలయ్యారని జైశంకర్ సభ దృష్టికి తీసుకెళ్లారు. జూలై 18న రష్యా జలాల్లో ‘ఎంవీ అమార్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో చీఫ్ ఆఫీసర్‌గా ఉన్న భారతీయుడు మరణించాడని చెప్పారు. ఆ మరుసటి రోజే ఒడెస్సా నుంచి బయలుదేరిన ‘ఎంవీ గోల్డెన్ లియో’ నౌకపై జరిగిన దాడిలో మరో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ఇతర దేశాల నావికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, అమాయకుల ప్రాణాలు తీసే ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేమని తేల్చిచెప్పినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

ప్రపంచ దేశాలు ఏకం కావాలి

సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే ఈ ప్రమాదకర ధోరణిని అడ్డుకోవడానికి అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 140 బిలియన్ డాలర్లకు పైగా అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతోందని, ఇందులో 80 శాతానికి పైగా కార్యకలాపాలు సముద్రాల మీదుగానే సాగుతున్నాయని వివరించారు. నౌకపై ఉండే జెండా ఒక దేశానిదైతే, అందులో పనిచేసే నావికులు వేర్వేరు దేశాలకు చెందినవారై ఉంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

రెండు వారాల క్రితం భారత్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ (BRICS) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రతిపాదనను జైశంకర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆపదలో ఉన్న నావికులకు తక్షణ సాయం అందించేందుకు ప్రత్యేక ‘ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్‌వర్క్’ ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. దీనిద్వారా ఆయా దేశాల రాయబార కార్యాలయాలు, సముద్ర విభాగాలను అనుసంధానించి నావికులకు తక్షణ వైద్య సాయం, కుటుంబ సభ్యులతో సమాచార మార్పిడి, సురక్షిత తరలింపు వంటి సేవలు వేగంగా అందించవచ్చని జైశంకర్ వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed