Ramayana: రామాయణ మూవీ.. ‘జై జై రామ్’ సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్, వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ. తాజాగా ఈ సినిమా నుంచి ‘జై జై రామ్’ సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు.

News18
News18

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇతిహాస చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వందల కోట్ల భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతమ్మగా న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి కనిపించనుంది.

అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడు, లంకాధిపతి అయిన రావణాసురుడి పాత్రలో ‘కేజీఎఫ్’ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్నాడు. యశ్ రాకతో ఈ ప్రాజెక్టు స్థాయి అమాంతం పెరిగిపోయింది. రణ్‌బీర్, సాయిపల్లవి, యశ్ వంటి భారీ తారాగణం ఉండటంతో ప్రేక్షకులు ఈ దృశ్యకావ్యం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ అందించారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ‘జయ జయ రామ్’ అనే అద్భుతమైన పాటను ముందుగా హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందీలో విశేష స్పందన తెచ్చుకున్న ఈ సాంగ్.. తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసింది. ఈ పాట తెలుగు వర్షన్‌ను మేకర్స్ అట్టహాసంగా విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి తమ హావభావాలు, దైవత్వంతో కూడిన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. తెలుగులో విడుదలైన ‘జయ జయ రామ్’ పాటకు ప్రముఖ రచయిత రాకేందు మౌళి అద్భుతమైన లిరిక్స్ అందించారు. దీపాలి, రాఘవ్ కౌశిక్ తమ మధురమైన గాత్రంతో ఈ పాటను ఆలపించారు. వినసొంపుగా ఉన్న ఈ భక్తిగీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమా విడుదల విషయానికొస్తే.. రామాయణ మహాకావ్యాన్ని పూర్తిగా ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో మేకర్స్ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాబోతున్న తొలి భాగం ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ క్లాస్ వీఎఫ్‌ఎక్స్ (VFX) హంగులతో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports