Last Updated:
Hyderabad OYO Room Mystery: అమీర్‌పేటలో మరో యువతి ఓయో గదిలో శవమైంది. గణేష్ అనే ఫ్రెండ్‌తో రూమ్ తీసుకున్న యువతి శిరీష మృతదేహంతో పాటు గదిలో లభ్యమైన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డును బట్టి పోలీసులు తప్పుడు పేర్లు చెప్పి రూమ్ తీసుకున్నట్లుగా గుర్తించారు.
Hyderabad OYO Room Mystery: హైదరాబాద్ నగరంలో అమ్మాయిల అనుమానాస్పదమృతి కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం మాదాపూర్‌లోని ఓయో రూమ్‌లో విగతజీవిగా పడివున్న ఓ అమ్మాయి శవం లభ్యమైంది. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే ఇప్పుడు అమీర్‌పేటలో మరో యువతి ఓయో గదిలో శవమైంది. గణేష్ అనే ఫ్రెండ్‌తో రూమ్ తీసుకున్న యువతి శిరీష మృతదేహంతో పాటు గదిలో లభ్యమైన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డును బట్టి పోలీసులు తప్పుడు పేర్లు చెప్పి రూమ్ తీసుకున్నట్లుగా గుర్తించారు. అంతే కాదు శిరీష పేరుతో ఓయో గదిలో చనిపోయిన యువతి అసలు పేరు దుర్గగా తేల్చారు. ఆమె చనిపోయిందా లేక ఆమె వెంట వచ్చిన వ్యక్తే చంపి పారిపోయాడా అనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఓయో గదిలో శవంగా కనిపించిన యువతి స్వస్తలం ఆధార్ కార్డు ప్రకారం వికారాబాద్కి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
ప్రేమ పేరుతో ఓవైపు మోసాలు పెరిగిపోతుంటే .. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలు రమ్మంటే చాలు ఎక్కడికైనా సరే వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిణామాలే వాళ్ల ప్రాణాలకు చేటుగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. తాజాగా హైదరాబాద్ అమీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. గోకుల్ ప్రైడ్ ఓయోలో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఓయో నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు స్పాట్‌కి చేరుకొని వివరాలు సేకరించారు.
ఎస్ఆర్నగర్ OYOలో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని గోకుల్ ప్రైడ్ OYOలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
సి. గణేష్ పేరుతో యువకుడు, యువతి రూమ్ నంబర్ 103లో దిగినట్లు ప్రాథమిక సమాచారం. ఉదయం గదిలో యువతి మృతదేహం కనిపించింది.
మృతురాలి ఆధార్ కార్డులో పేరు… pic.twitter.com/1gsIwuwdRY
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 29, 2026
ఓయో గదిలో విగతజీవిగా పడివున్న యువతి పేరు దుర్గగా గుర్తించారు. ఆమె వికారాబాద్ జిల్లాకు చెందినట్లుగా రూమ్‌లో దొరికిన యువతి బ్యాగ్‌లోని ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల ఆధారంగా తెలుసుకున్నారు పోలీసులు. అయితే మృతురాలు దుర్గ ఆమెతో వచ్చిన గణేష్ అనే ప్రియుడి పేరును, తన పేరును మార్చి చెప్పి రూమ్ రెంట్‌కి తీసుకున్నారు. సోమవారం ఓయో రూమ్ తీసుకున్న జంట తెల్లవారేసరికి యువతి బెడ్డుపై చనిపోయి కనిపించింది. టిఫిన్ ఇచ్చేందుకు వెళ్లిన ఓయో సిబ్బందికి డోర్ ఓపెన్ కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో తలుపులు తెరిచి చూడగానే యువతి మృతదేహం కనిపించింది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి బ్యాగ్‌లో ఆధార్, సర్టిఫికెట్లను పరిశీలించారు. మృతురాలి పేరు ఓయో రికార్డులో చూపినట్లుగా శిరీష కాదని అసలు పేరు దుర్గ అని తేల్చారు. అంతే కాదు ఆమె వెంట వచ్చిన గణేష్ అసలు పేరు శ్రీనివాస్‌గా గుర్తించారు.
దుర్గ చనిపోయిన తర్వాత శ్రీనివాస్ పరారీలో ఉండటంతో పోలీసులు అతడినే అనుమానిస్తున్నారు. దీంతో పాటు రూమ్‌లో మద్యం బాటిల్లు కూడా లభించడంతో మద్యం తాగి ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. యువతితో ఓయో రూమ్‌కి వచ్చిన వ్యక్తి శ్రీనివాస్ మినీ బ్యాంకులో యువతికి పరిచయమైనట్లుగా భావిస్తున్నారు. మృతురాలు వికారాబాద్ వాసిగా తేలడంతో మరిన్ని వివరాలు రాబడుతున్నారు.ఓయో రూమ్‌లో అమర్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సరిగ్గా వారం రోజుల క్రితం మాదాపూర్ ఓయో రూమ్‌లో విశాఖకు చెందిన నిఖిత అనే యువతి కూడా ఇదే తరహాలో రూమ్‌లో శవమై కనిపించింది. ఆమెతో పాటు వచ్చిన ప్రియుడు పరార్ అవడం, మృతురాలి శరీరంపై గాయాలుండటంతో ఆకేసులో కూడా ప్రియుడ్నే పోలీసులు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు.














