Rajinikanth viral Video: ఆటోలో షూటింగ్‌కు వచ్చిన రజినీకాంత్.. సూపర్ స్టార్ ఏంట్రీ చూసి అంతా షాక్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించిన తలైవా. ఆయనను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. రజినీకాంత్ ఆటో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News18
News18

కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెరపై తన స్టైల్, స్వాగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించే తలైవా.. నిజ జీవితంలో మాత్రం చాలా సాధారణంగా, నిరాడంబరంగా ఉంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌‌గా మారింది. మైసూర్‌లో జరుగుతున్న తన తాజా చిత్రం ‘ధర్మన్’ (Dharman) షూటింగ్ లొకేషన్‌కు రజనీకాంత్ ఏకంగా ఒక సాధారణ ఆటో రిక్షాలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రజినీకాంత్.

కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ఒక అగ్ర హీరో, ఎలాంటి బేషజాలు లేకుండా ఇలా ఆటోలో ల్యాండ్ అవ్వడం చూసి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మైసూర్‌లోని అవుట్‌డోర్ షెడ్యూల్‌లో రజనీకాంత్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు సెట్స్ బయట బారులు తీరారు. ఆయన తన లగ్జరీ కార్లను పక్కనపెట్టి, సెక్యూరిటీ కాన్వాయ్ నడుమ సింపుల్‌గా ఆటో దిగగానే అభిమానుల కేరింతలు మిన్నంటాయి. జనాన్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది మెయిన్ గేట్ లాక్ చేయడానికి ప్రయత్నించగా, రజనీకాంత్ వెంటనే వారిని వారించారు. మెరూన్ షర్ట్, ట్రెడిషనల్ దోతి ధరించి బయటకు వచ్చిన ఆయన, తన ఐకానిక్ ‘బాబా’ హ్యాండ్ సింబల్ చూపిస్తూ చిరునవ్వుతో అందరినీ పలకరించారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం ఈ సింప్లిసిటీకి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఈ ఆటో ఎంట్రీ ఒక ఎత్తు అయితే, ‘ధర్మన్’ సెట్స్ నుంచి లీకైన సమాచారం టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్లు నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మైసూర్ సెట్స్‌లో శ్రీలీల సాంప్రదాయ పట్టు పావడాతో కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి తోడు, ఇటీవల హీరోయిన్ రాశీ ఖన్నా తన సోషల్ మీడియాలో రజనీకాంత్, రామ్ పోతినేనితో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. అయితే, రామ్ క్యాస్టింగ్ గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గ్రహించిన ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఈ టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ నిజమైతే సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఊహించని బిజినెస్ జరగడం ఖాయం.

భారతీయ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ కలయికలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటం మరో విశేషం. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్, స్టార్ కమెడియన్ యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘ధర్మన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది. ఈ పోస్టర్‌లో రజనీకాంత్ డాక్టర్ స్క్రాబ్స్ డ్రెస్ ధరించి, చేతిలో రక్తం ఓడుతున్న స్కాల్పెల్‌తో భయంకరంగా కనిపించారు. చుట్టూ మృతదేహాలు పడి ఉన్న ఆ పోస్టర్‌కి ‘ద డెడ్లీ డాక్టర్’ (The Deadly Doctor) అనే ట్యాగ్ లైన్ జోడించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. మైసూర్‌లో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్ క్యాస్టింగ్, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed